
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అందులో జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా సోకగా, రోటికనిగూడలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. వీరంతా ఈ నెల 12 న మహారాష్ట్ర నుంచి సొంత ఊళ్లకు వచ్చారు. కాగా వీరందరిని బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో కరోనా వచ్చిన 27 మంది ఉపాధి కోసం మహారాష్ట్ర వెళ్లి లాక్ డౌన్ నేపధ్యంలో ఇటీవల సొంత ఊళ్లకు తిరిగి వచ్చిన వారే కావడం గమనార్హం.
(24 గంటల్లో.. 6654 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment