సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో పాజిటివ్ కేసులేకాదు అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. రెండు రోజుల క్రితమే ఖాళీ అయిన క్వారంటైన్ సెంటర్లు అనుమానితులతో మళ్లీ నిండుకుంటున్నాయి. విదేశాల నుంచివచ్చిన వారు సహా మర్కజ్ వెళ్లి వచ్చిన వారందనీఇప్పటికే క్వారంటైన్ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 280కిపైగా కేసులు నమోదు కాగా, వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యుల నుంచి 50 కేసులు నమోదైతే.. మిగితా మర్కజ్ బాధితులు, వారికి సన్నిహితంగా మెలిగిన వారివే. వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ కూడా అయిపోయినట్లు ప్రభుత్వం భావించింది. క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని భావించింది. కానీ అనూహ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
సోమవారం 61 కేసులు నమోదు కాగా, వీటిలో 35 కేసుల వరకు గ్రేటర్‌లోనే ఉన్నట్లు తెలిసింది. ఒకవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, మరో వైపు దగ్గు, జలుబు, జ్వరం వంటి అనుమానిత లక్షణాలతో బాధపడుతూ క్వారంటైన్ సెంటర్లకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మంగళవారం చార్మినార్ యునానీ ఆస్పత్రి ఐసోలేషన్ సెంటర్‌లో 93 మంది చేరగా, ఫీవర్ ఆస్పత్రిలో 19 మంది చేరారు. ఎర్ర గడ్డ ఛాతీ ఆస్పత్రిలో ప్రస్తుతం 28 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పాజిటివ్ బాధితులు ఉన్నారు. ప్రస్తుతం గాంధీలో మరో 472 మందికిపైగా పాజిటివ్ కేసులకు చికిత్సలు అందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment