హైదరాబాద్:ముఖ్యమంత్రి సంక్షేమ నిధి(సీఎం రిలీఫ్ ఫండ్)లో వెలుగుచూసిన అవినీతి అంశంతో కార్పోరేట్ ఆస్పత్రులకు సంబంధాలు ఉన్నాయా? సంక్షేమ నిధికి వచ్చే నిధులను పలు ఆస్పత్రులు దుర్వినియోగం చేశాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో సీఐడీ విభాగం చేపట్టిన దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన వెలుగుచూస్తున్నాయి. ఆ స్కాంతో 54 కార్పోరేట్ ఆస్పత్రులకు సంబంధాలున్నట్లు తాజాగా గుర్తించారు. నకిలీ బిల్లులు, లెటర్ హెడ్ లు స్పష్టించి స్కాంకు పాల్పడ్డట్లు సీఐడీ గుర్తించింది.
హైదరాబాద్ నగరంతో పాటు,వరంగల్, కరీంనగర్ లోని 20 కార్పోరేట్ ఆస్పత్రులకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఒక వెయ్యి రెండొందల 51 దరఖాస్తులపై సీఐడీ తన దర్యాప్తును పూర్తి చేసింది.