వాస్తు దోషాలను సరిదిద్దండి | Correct errors in the layout | Sakshi
Sakshi News home page

వాస్తు దోషాలను సరిదిద్దండి

Published Thu, Oct 20 2016 12:54 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

వాస్తు దోషాలను సరిదిద్దండి - Sakshi

వాస్తు దోషాలను సరిదిద్దండి

- యాదాద్రి అభివృద్ధి పనుల పరిశీలన సందర్భంగా సీఎం ఆదేశం
- ఆగ్నేయంలో సంపుల నిర్మాణం వద్దు
- టెంపుల్ సిటీలో ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్
- హైదరాబాద్ హౌస్ తరహాలో ప్రెసిడెన్షియల్ సూట్‌లు
 
 సాక్షి, యాదాద్రి: ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్న యాదాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధి పనుల్లో వాస్తుదోషాలను సరిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరిశీలించారు. ముందుగా ప్రధాన ఆలయానికి చేరుకున్న సీఎంకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎం కొండపైన జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీ లించారు. గర్భగుడి, ఆంజనేయస్వామి ఆలయాలను కదిలించకుండా అభివృద్ధి పనులను చేయాలని సూచించారు.

రిటైనింగ్ వాల్, రాజగోపురాలు ఆలయ విస్తరణ పనులను తిలకించారు. ఈ సందర్భంగా శివాలయం, పుష్కరిణి మధ్యన నిర్మిస్తున్న మంచినీటి సంపు వివరాలను అడిగి తెలుసుకొని అవి వాస్తుకు విరుద్ధంగా ఉండడంతో సవరింపజేశారు. మంచినీటి ట్యాంకును ఎత్తయిన అన్నదాన సత్రంపై నిర్మించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూనే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే మూడంతస్తుల క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని, వంటశాల, ప్రసాదాల తయా రీ ప్రాంతాలను సీఎం పరిశీలించారు. పుష్కరిణి, మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని... దానికి అనుగుణంగా వసతులు ఉండాలని సూచించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు జరగాలని సీఎం పేర్కొన్నారు.

అనంతరం సమీపంలోని పెద్దగుట్టపై చేపడుతున్న టెంపుల్ సిటీ పనులను సీఎం సందర్శించారు. 250 ఎకరాల్లో 250 కాటేజీలు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, క్యాంటీన్లతో కూడిన లే అవుట్‌ను సుమారు గంటసేపు పరిశీలించారు. గుట్ట పైభాగంలో నిర్మించే ప్రతి కాటేజీ వరకు రోడ్డు నిర్మాణం ఉండాలని... టెంపుల్ సిటీని విస్తరించేందుకు మరో 150 ఎకరాల భూసేకరణ చేయాలని ఆదేశించారు. ఇందులో కల్యాణ మండపాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్మించాలన్నారు. ప్రధాన ఆలయానికి ఈశాన్యం దిశలో సైదాపురం రోడ్డులో ఉన్న 13 ఎకరాల గుట్టపై ప్రెసిడెన్షియల్ సూట్‌లు నిర్మించాలని ఆదేశించారు. ఢిల్లీలోని హైద రాబాద్ హౌస్ తరహాలో సూట్‌లు ఉంటాయన్నారు. ఒక్కో సూట్ రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు వివరించారు.

ప్రెసిడెన్షియల్ సూట్‌ను రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, గవర్నర్లకు మాత్రమే కేటాయిస్తామని చెప్పారు. వీటి నిర్మాణానికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే గుట్టకు దిగువ భాగంలో ఉన్న గోశాల, బస్టాండ్ స్థలాలను సీఎం పరిశీలించారు. తూర్పు, పడమర మార్గంలో నాలుగు లేన్ల రోడ్డును అభివృద్ధి చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి సమీపంలోని గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు వస్తున్నాయని... వీటితోపాటు గుట్టలోని చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

సీఎం వెంట విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగి డి సునీత, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఈవో గీతారెడ్డి, ఆలయ శిల్పి ఆనంద్ సాయి, టెంపుల్ సిటీ రూపశిల్పి జగన్మోహన్‌రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, స్తపతి సుందరరాజన్, బడే రవి, ఏజేసీపీ శశిధర్‌రెడ్డి, జేసీపీ పి.యాదగిరి, ఏసీపీ మోహన్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ స్వామి, ఎంపీపీ జి.స్వప్న ఉన్నారు.
 
 ఉన్నతాధికారులతో సమీక్ష
 అభివృద్ధి పనులను పరిశీలించాక సీఎం అధికారులతో సమీక్షించారు. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగనున్నందున ఆ దిశగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయనున్న పెద్దగుట్ట ప్రాం తంలో అవసరమైన స్థలాన్ని సేకరించాలన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేం దుకు 4 దిక్కులా నాలుగు వరుసల రోడ్లు నిర్మించాలని, వంగపల్లి నుంచి యాదగిరిగుట్టకు రావడానికి 4 లేన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. స్వామి పూజకవసరమయ్యే పూలకోసం మొక్కలను స్థానికంగా పెంచేందుకు ఉద్యాన వనాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం యాదగిరిగుట్టలోనే నర్సరీ ఏర్పా టు చేయాలని అటవీ అధికారులకు సూచించారు. కాటేజీల నిర్మాణానికి జాతీ య స్థాయిలో దాతలు ముందుకు వస్తున్నందున త్వరగా లేఅవుట్‌లు రూపొం దించి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement