నిజామాబాద్‌లో దంపతుల దారుణ హత్య
నిజామాబాద్‌లో దంపతుల దారుణ హత్య
Published Sun, Oct 23 2016 2:38 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక హైమద్‌పూర కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హతమర్చారు. గత కొంతకాలంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మైసయ్య(57), లక్ష్మీ(48)లను గుర్తుతెలియని దుండుగులు శనివారం రాత్రి హత్యచేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మైసయ్య భార్య చెన్నమ్మ చాలా ఏళ్ల క్రితం మృతిచెందడంతో.. భార్య చెల్లెలైన పాపమ్మను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. గత కొంత కాలంగా పాపమ్మను వదిలేసి లక్ష్మీతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి కూడా మైసయ్య కొడుకు, కూతురు హైమద్‌పూరకు వచ్చి అతనితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే దంపతుల హత్య జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Advertisement
Advertisement