
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి కోవిడ్-19 కేసు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. దీంతోపాటు వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం ఉదయం భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ సందర్భంగా తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో హోర్డింగ్‌లు, వాల్ పోస్టర్‌లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. దానిలో భాగంగా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ.. ‘ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం’అని ఓ పోస్టర్ విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాల సమాచారం కోసం హెల్ప్‌లైన్ 040-24651119 నెంబర్ ను సంప్రదించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment