‘బూర్జువా పార్టీలకు ప్రజలే బాహుబలి’ | cpi leader chada criticize the trs government | Sakshi
Sakshi News home page

‘బూర్జువా పార్టీలకు ప్రజలే బాహుబలి’

Published Mon, Mar 20 2017 5:14 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

‘బూర్జువా పార్టీలకు ప్రజలే బాహుబలి’ - Sakshi

‘బూర్జువా పార్టీలకు ప్రజలే బాహుబలి’

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ కు అహంభావం పెరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం.. ఎప్పటికైనా ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని ఆయన.. ఆ హామీని విస్మరించారన్నారు. మళ్లీ మాయమాటలతో మభ్యపెడుతున్నారు. మాటలతో కోటలు కడుతున్నారని చెప్పారు.

బూర్జువా పార్టీలకు ప్రజలే బాహుబలి అని వ్యాఖ్యానించారు. రాజధానిలో ప్రజల గొంతు నొక్కుతున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. 2019 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుతామని చెప్పారు. ప్రజల సమస్యలపై ఈనెల 27న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు వివరించారు. కమ్యూనిస్టులకు సిద్ధాంతాలపై కేసీఆర్ పాఠాలు అవసరం లేదన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement