తెలంగాణ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్
సాక్షి, హైదరాబాద్: నేర విచారణ చట్టానికి (సీఆర్‌పీసీ) సవరణలు చేయడంతోపాటు, న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలంగాణ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ప్రకటించింది. ఫెడరేషన్ అధ్యక్షులు బి.కొండారెడ్డి నేతృత్వంలో శనివారం రాష్ట్ర కార్యవర్గం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో సమావేశమైంది.
సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఎ సవరణలతో ఏడేళ్లలోపు శిక్షపడే నేరాల్లో నిందితులకు పోలీస్‌స్టేషన్‌లోనే బెయిల్ మంజూరు చేస్తున్నారని, దీంతో నిందితులకు చట్టవ్యవస్థపై భయంలేకుండా పోతోందని కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులుంటే బెయిల్ వస్తుందనే అభిప్రాయంతో కొందరు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని, ఇది సమాజానికి ప్రమాదకరమన్నారు. బెయిల్ కోసం కోర్టులను మాత్రమే ఆశ్రయించేలా సీఆర్‌పీసీకి సవరణలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరనున్నామన్నారు.
సీఆర్‌పీసీకి సవరణలు చేయాలి
Published Sun, Jun 28 2015 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement