సాక్షిప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి అకృత్యా లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నా యి. మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారనే ఆగ్రహంతో దళిత యువకులు బచ్చల రాజేశ్వర్, కొండ్రా లక్ష్మణ్‌ను దూషిస్తూ నీటి కుంటలో ముంచిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా బాధితులతో ముక్కు నేలకు రాయించిన దృశ్యాలు వెలుగు లోకి వచ్చాయి. భరత్‌రెడ్డి ఈ ప్రాంతంలో సెటిల్‌మెంట్ల దందా నడుపుతున్నట్లు ఆరోప ణలున్నాయి.
తాజాగా ఈ ప్రాంతంలో జరిగే మొరం అక్రమ తవ్వకాలకు, ఇసుక దందా వంటి వాటికి అండగా నిలుస్తాడనే విమర్శలూ ఉన్నాయి. భరత్‌కు రాజకీయ నేతల అండ దండలతో అకృత్యాలకు అడిగే నాథుడే లేకుండా పోయారు. భరత్‌రెడ్డి ఆగడాలపై ఆదివారం దళిత, విద్యార్థి, ప్రజాసంఘాలు నవీపేట్, అభంగపట్నం గ్రామాల్లో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. వివిధ వర్శిటీల నుంచి విద్యార్థి సంఘాలు ఈ ఆందోళన కార్యక్రమానికి తరలివచ్చి మద్దతు తెలిపాయి. భరత్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి.
టీఆర్‌ఎస్ నేత కారులోనే కిడ్నాప్..
బాధితులను కుంటలో ముంచిన వీడియా ఈనెల 11న వైరల్ కావడంతో అప్రమత్తమైన భరత్‌రెడ్డి బాధితులను ఈనెల 12న కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు బాధితుల కుటుంబసభ్యు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భరత్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసిన విషయం విదితమే. కాగా, బాధితులను కిడ్నాప్ చేసింది అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కారులోనే కావడం గమనార్హం.
నవీపేట్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌కు చెందిన వాహనంలోనే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. చైర్మన్ కారును భరత్‌రెడ్డి హైదరాబాద్‌లో వదిలి వెళ్లడంతో దానిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నరేశ్ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, పరారీలో ఉన్న భరత్‌రెడ్డి కోసం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైతం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, మహారాష్ట్ర తదితర చోట్లలో గాలిస్తున్నాయి. భరత్‌రెడ్డి ఆచూకీ కోసం ఆయన బంధువులు, సన్నిహితులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే రెండు హత్య కేసుల్లో నిందితుడైన భరత్‌రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment