
అమ్మానుషం..!
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లులే.. మాతృత్వాన్ని మరిచి, కర్కశంగా మారారు. తనను భర్త అనుమానించడంతో ఒక మహిళ తట్టుకోలేక... ఇద్దరు చిన్నారులను చెరువులో పడేసి తొక్కి చంపేసింది.
దోమకొండ, డిచ్‌పల్లి: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లులే.. మాతృత్వాన్ని మరిచి, కర్కశంగా మారారు. తనను భర్త అనుమానించడంతో ఒక మహిళ తట్టుకోలేక... ఇద్దరు చిన్నారులను చెరువులో పడేసి తొక్కి చంపేసింది. మరో తల్లి... వికలాంగురాలైన కూతురిని సాకలేక విషమిచ్చి, తానూ తాగింది. ఈ దారుణాలు నిజామాబాద్ జిల్లాలో బుధవారం జరిగాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలివీ...కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం గజసింగారానికి చెందిన లావణ్యకు దోమకొండ మండలం అంబర్‌పేటకు చెందిన పిడుగు నవీన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి కుమారుడు నాగచైతన్య(3), కూతురు పల్లవి (3నెలలు) ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉండే భర్త నవీన్, ఊళ్లోకి వచ్చినప్పుడల్లా భార్య లావణ్యతో గొడవపడేవాడు. తరచుగా ఆమెను అనుమానించేవాడు. ఈ క్రమంలో బుధవారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తట్టుకోలేని కోపంతో లావణ్య కొడుకు నాగచైతన్య, కూతురు పల్లవిని ఊరిచివరి చెరువులోకి తీసుకెళ్లి, బురదలో ముంచి కాళ్లతో తొక్కి చంపేసింది.
కూతురికి సపర్యలు చేయలేక..
మరో సంఘటన... డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని వెస్లీ తండాలో జరిగింది. తండాకు చెందిన చౌహాన్ తిరుమల, రవి దంపతులకు కొడుకు రక్షపతి, కూతురు శ్రీలక్ష్మి (6) ఉన్నారు. శ్రీలక్ష్మి పుట్టుకతోనే వికలాంగురాాలు కావడంతో మంచానికే పరిమితమైంది. కూతురుకు అవసరమైన అన్ని పనులు తల్లి చూసుకునేది. రోజూ సపర్యలు చేయాల్సి రావడం, వైద్య ఖర్చులు భరించలేనివిగా మారటంతో తిరుమల మనస్తాపానికి గురైంది.
దీంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగు మందును కూతురికి తాగించి, తనూ తాగింది. వీరిని కుటుంబసభ్యులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కూతురు మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమించడంతో ప్రైవే ట్ ఆస్పత్రికి తరలించారు.