వరంగల్: ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం హఠాత్తుగా దూరమవడంతో దాని యజమాని చలించిపోయాడు. దూరమైన పెంపు జంతువుకు శాస్త్ర ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించి తన మమకారాన్ని చాటుకున్నారు. వరంగల్ పట్టణంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన గన్నోజు సురేందర్ స్థానికంగా టింబర్ డిపో నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర వయసున్న జర్మన్ షెఫర్డ్ జాతి శునకాన్ని సురేందర్ తన ఇంట్లో పెంచుకుంటున్నారు. అస్వస్థతతో ఆ శునకం ఆదివారం సాయత్రం ఆకస్మికంగా మృతి చెందింది. దీంతో ఆవేదన చెందిన సురేందర్ కుటుంబ సభ్యులు, స్థానికుల తోడ్పాటుతో శునక కళేబరాన్ని ఓ పాడెపై ఉంచి, పూల దండ వేసి దాన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పక్కన ఖాళీ స్థలంలో ఖననం చేశారు.
(కరీమాబాద్)
పెంపుడు శునకానికి కన్నీటివీడ్కోలు
Published Sun, Feb 1 2015 8:26 PM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM
Advertisement
Advertisement