లోటు 3 మిలియన్ యూనిట్లు
వ్యవసాయానికి 3 నుంచి 4 గంటలే విద్యుత్ సరఫరా
అధికారికంతోపాటు అనధికారిక కోతలు లైన్‌క్లియర్ పేరిట ప్రాంతాల వారీగా అమలు
ఎండుతున్న పంటలు ఆందోళనలో రైతులు
హన్మకొండ సిటీ :డిమాండ్‌కు తగిన విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జిల్లాకు 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా... 9 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. లోటు 3 మిలియన్ యూనిట్లు ఉండడంతో అధికారులు ఇప్పటికే అప్రకటిత కోతలకు తెరతీశారు. తాజాగా ఎండలు మండుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం పెరగడంతో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చేతులెత్తేసింది. వ్యవసాయ సాగుకు సైతం కరెంట్ కోతలను పకడ్బందీగా అమలు చేస్తోంది. లోడ్ ఒక్కసారిగా పెరగడం తో రోజుకు విడతల వారీగా మూడు, నాలుగు గంటలు కూడా సరఫరా చేయడం లేదు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ అం దించాల్సి ఉండగా... ఐదు గంటలు సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ అధికారులు ఇటీవల ప్రకటించారు. కానీ.. ఆచరణలో విపలమయ్యూరు. మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా చే స్తామని పలు సందర్భాల్లో చెప్పారు. అవన్నీ ఉపన్యాసాలకే పరిమితమయ్యూరుు. లోటు విద్యుత్ నేపథ్యంలో కోతల వేళలు కాకుండా ప్రాంతాల వారీగా అధికారులు లైన్‌క్లియర్ పేరిట కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఇలా అప్రకటిత కోతలకు తోడు లోఓల్టేజీ, హై ఓల్టేజీతో కరెంట్ తరచుగా ట్రిప్ అవుతుండడం వంటి సమస్యలతో పంట తడులు అందించలేని దుస్థితి నెలకొంది. పంట చేతికొచ్చే సమయంలో విధిస్తున్న కోతలు వారిని అతలాకుతలం చేస్తున్నారుు.
పంటలు చేతికందే సమయంలో...
ఖరీప్ ప్రారంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం తగ్గా... అదును దాటిన తర్వాత కురిసిన వర్షాలతో కొన్ని పంటలు దెబ్బతిన్నారుు. ఆ తర్వాత వర్షాలు మొహం చేటేశారుు. రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులైన బావులు, బోర్లు, వాగుల కింద కరెంట్‌ను నమ్ముకుని 30 శాతం మాత్రం వరి సాగు చేస్తే.. రోజులు నాలుగు గంటలు కూడా సక్రమంగా సరఫరా కాకపోవడంతో జిల్లాలో అనేక చోట్ల పంటలు ఎండిపోతున్నారుు. చేతికొచ్చిన మొక్కజొన్న, పత్తి, మిర్చి లాంటి పంటలు దెబ్బతింటున్నారుు. నాలుగు రోజులుగా ఎండ వేడి పెరగడంతో పత్తి, మిర్చి పూత, కాత రాలిపోతోంది. డ్రైస్పెల్ సుదీర్ఘకాలం ఉండడంతో పంటలన్నీ వాడిపోతున్నారుు. ఇలాంటి సమయంలో విధిలేని పరిస్థితుల్లో అమలు చేస్తున్న విద్యుత్ కోతలు రైతులను నిరాశకు గురిచేస్తున్నారుు. ఈ నేపథ్యం లో రైతులు ఆందోళనలు తీవ్రం చేయడంతో ఎన్పీడీసీఎల్ అధికారులు పరిశ్రమలకు, గృహా వసరాలకు కోతల సమయం పెంచారు.