
డిగ్రీ చేసేద్దాం
జిల్లా వ్యాప్తంగా గత మూడు సంవత్సరాలు పరిశీలిస్తే.. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య ఏటా పెరిగింది.
- డిగ్రీ కోర్సులపై యువత ఆసక్తి
- ఏటేటా పెరుగుతున్న ప్రవేశాలు
- ప్రతిభ ఉంటే ఉద్యోగావకాశాలు పుష్కలం
పెరుగుతున్న అడ్మిషన్లు..
జిల్లా వ్యాప్తంగా గత మూడు సంవత్సరాలు పరిశీలిస్తే.. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య ఏటా పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం 112 డిగ్రీ కళాశాలలు ఉన్నారు. మరో 20 కళాశాలలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్ని కళాశాలల్లోనూ ఏటా ప్రవేశాలు పెరుగుతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 30 వేల నుంచి 40 మంది విద్యార్థులు డిగ్రీ పట్టా పుచ్చుకుని ఉపాధి సమాజంలోకి అడుగుపెడుతున్నారు.
గతంలో ఇంజినీరింగ్ విద్యపై మక్కువ పెంచుకున్నవారు ప్రస్తుతం డిగ్రీల వైపు మళ్లుతుండడంతో పట్టభద్రుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న యువత డిగ్రీ పూర్తిచేయూలని నిర్ణరుుంచుకుంటున్నారు. పరిశ్రమల రంగంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కన్నా...చదువుకున్న వారే ఎక్కువగా అవసరమని భావిస్తున్న చాలామంది డిగ్రీ బాటపడుతున్నారు.
మూడేళ్లలో బోలెడు అవకాశాలు
ఇంజినీరింగ్ నాలుగేళ్లు చదవాలి. డిగ్రీ అరుుతే కేవలం మూడు సంవత్సరాలు అరుుతే సరిపోతుంది. ఆ తర్వాత ఏదైన ఉద్యోగంలో చేరవచ్చనే అభిప్రాయం విద్యార్థుల్లో ఎక్కువగా ఉంది. బీఏ, బీఎస్సీ, బీకాంలు పూర్తికాగానే ఎల్‌ఎల్‌బీ, బీఈడీ వంటి డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉంటున్నారు. న్యాయవాద వృత్తిపై ఆసక్తిగలవారు ఎల్‌ఎల్‌బీ, విద్యారంగంపై మక్కువ ఉన్నవారు బీఈడీ కోర్సుల్లో చేరుతున్నారు.3
సెమిస్టర్ల బెంగ లేదు
ఇంజినీరింగ్ విద్యకు అరుుతే సెమిస్టర్‌కు ఓసారి పరీక్షలుంటారుు. దీంతో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నట్లు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక విద్యలో ఎప్పుడు చదువు, మార్కులు తప్ప వేరే ద్యాస ఉండదు. ఇతర విషయాలు ఆలోచించడానికి తీరిక ఉండదు. అదే డిగ్రీలో అయితే ఏడాదికోసారి పరీక్షలుంటారుు. ఇటు చదువుతూనే అటు ఎన్నో పోటీ పరీక్షలకు హాజరుకావచ్చు. కోర్సు పూర్తరునవెంటనే కంప్యూటర్స్, బ్యాంకింగ్, గ్రూప్స్ వంటి ఎన్నో పోటీ పరిక్షలకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు.
డిగ్రీ చేసినవారే అవసరం..
ఇప్పుడు సీన్ రివర్స్ అరుుంది. గతంలో కేవలం ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ఉండేవి. ఇప్పుడు చాలా సాప్ట్‌వేర్ కంపెనీలు కేవలం డిగ్రీ అర్హతగా ఉద్యోగాలు అందిస్తున్నాయి. ఇంజినీరింగ్ విద్యలో అయితే ఇంటర్వూల్లో ప్రత్యేక స్కిల్స్‌కి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. ఇంజినీరింగ్ వారికి కనీస వేతనం దాదాపు 15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డిగ్రీ విద్యార్థులను ఎంపిక చేసుకుంటే రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు ఇచ్చినా సంతోషంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో ఎవరికైనా కంపెనీలవారీగా ప్రత్యేక శిక్షణ ఇస్తే కానీ పనిచేయలేరు. అలాంటప్పుడు ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే డిగ్రీ విద్యార్థులే మేలని సాప్ట్‌వేర్ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నారుు.
పట్టా చేతిలో ఉంటే పుట్టెడు మార్గాలు
ఏదైనా ఒక డిగ్రీ చేతిలో ఉంటే చాలు.. ఉద్యోగాల వేటలో పడొచ్చు. బీఈడీ చేస్తే ఉపాధ్యాయ వృత్తిలో రాణించవచ్చు. ఎల్‌ఎల్‌బీ చేసి న్యాయవాదిగా స్థిరపడొచ్చు. పీజీ చేస్తే అధ్యాపకుడిగా..బ్యాంకింగ్, రైల్వే, నావీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ వంటి రంగాల్లో విభిన్న ఉద్యోగాలు ముందుంటాయి. ఎంపికకు అవకాశం ఉన్న చదువు కావడంతో ఒక రంగంలో కాకపోయిన మరో రంగంలో స్థిరపడొచ్చు అన్న భావన విద్యార్థుల్లో పెరిగింది.
స్కాలర్‌షిప్ సమస్య
ఎస్టీ, ఎస్టీ, బీసీ తదితర విద్యార్థులకు నేరుగా వారివారి బ్యాంకు ఖాతాలోకి స్కాలర్‌షిప్ డబ్బులు వచ్చేవిధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఒక్కో విద్యార్థికి దాదాపు రూ. మూడు వేలవరకు వస్తారుు. ఇంజినీరింగ్ విద్యను ఎంచుకున్నట్లరుుతే కోర్సు చేయడానికే లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. స్కాలర్‌షిప్‌లు, రాయితీలు కొంతవరకే వస్తాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలా..
వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకం పేద విద్యార్థుల పాలిట వరంగా మారింది. ప్రస్తుతం ఎందరో పేద విద్యార్థులు విద్యావంతులయ్యేట్లు చేసింది. మూడేళ్ల డిగ్రీకి అన్ని ఖర్చులు కలుపుకున్నా.. రూ. 10 వేలకు మించదు.
డిగ్రీ విద్యలోనూ పెనుమార్పులు
డిగ్రీ విద్యలోనూ పెనుమార్పులు వచ్చారుు. కేవలం చదవు చెప్పి డిగ్రీ ఇప్పించడమే కాకుండా ఇంజినీరింగ్ తరహాలో ప్రముఖ కంపెనీలను ఉద్యోగాల నిమిత్తం డిగ్రీ కళాశాలల్లోకి ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులకు కళాశాలలోనే ఉన్నత ఉద్యోగాలు సాధించేలా చేస్తున్నాం. దీనికోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఏర్పాటుచేశాం. బోధనతో పాటు విజ్ఞాన సమాచారం అందుబాటులో ఉంచి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.
-నాగమల్ల మహేశ్, వికాస్ డిగ్రీ కళాశాల డెరైక్టర్