కాలు జారిపడి బాలింత మృతి | Delivery Woman dies at cmk hospital in warangal city | Sakshi
Sakshi News home page

కాలు జారిపడి బాలింత మృతి

Published Tue, Oct 28 2014 11:49 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

కాలు జారిపడి  బాలింత మృతి - Sakshi

కాలు జారిపడి బాలింత మృతి

వరంగల్: వరంగల్ నగరంలోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆసుపత్రి బాత్రూమ్లోకి వెళ్లిన బాలింత ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మృతి చెందింది. దీంతో మృతిరాలి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉండడం వల్లే బాలింత మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు.  దీంతో ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  మృతురాలు మంజుల స్వస్థలం తొర్రూర్ మండలం నాంచారి మదూరని ఆమె బంధువులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement