‘డేరా’ భూములు స్వాధీనం చేసుకుంటాం | 'Dera' lands will be acquired | Sakshi
Sakshi News home page

‘డేరా’ భూములు స్వాధీనం చేసుకుంటాం

Published Mon, Aug 28 2017 3:52 AM | Last Updated on Tue, Sep 12 2017 1:07 AM

'Dera' lands will be acquired

నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మం డలం వెలిమినేడులోని గుర్మిత్‌ రామ్‌ రహీం సింగ్‌ డేరా సచ్చా సౌదాలోని అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుంటామని ఆర్డీవో వెంకటాచారి తెలిపారు. వెలిమినేడు లోని జాతీయ రహదారి వెంట గల డేరా సచ్చా సౌదాను ఆదివారం ఆయన సంద ర్శించారు. భూముల వివరాలను ఆ సంస్థ నిర్వాహకుడు శ్యాంలాల్‌ను అడిగి తెలుసు కున్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ డేరా సచ్చా సౌదాలోని 56 ఎకరాల భూముల్లో 9 ఎక రాల 20 గుంటలు అసైన్డ్‌ భూములుగా ఉన్నాయని తేలిందని, వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.

Advertisement

పోల్

Advertisement