జయశంకర్ కలలు కన్నట్టే అభివృద్ధి
తెలంగాణ సిద్ధాంతకర్తను స్మరించుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌ను ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. జయశంకర్ 5వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ వస్తే తప్ప ఇక్కడి ప్రజల బతుకులు బాగుపడవనే విషయాన్ని ఆయన ఎప్పుడూ చెబుతుండే వారని చెప్పారు. జయశంకర్ సార్ కలలు కన్నట్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, పురోగమిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో నివాళి
ఆచార్య జయశంకర్ 5వ వర్ధంతి సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.