యాదగిరికొండ (నల్లగొండ): తన బ్యాగులోంచి రూ.1.5లక్షలు చోరీకి గురయ్యాయంటూ ఓ భక్తుడు ఆదివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నానా హంగామా సృష్టించాడు. నిజామాబాద్ నుంచి నాయక్ అనే భక్తుడు స్నేహితులతో కలిసి దైవ దర్శనం చేసుకుని బయటికి వచ్చి తన బ్యాగులో ఉన్న రూ.1.5 లక్షలను ఎవరో కాజేశారంటూ హడావిడి చేశాడు. అంతేకాదు దీనిపై కొండపైన ఎస్పీఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో... ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి ఆలయంలోని వీడియో ఫుటేజీలను పరిశీలించగా దొంగతనం జరిగినట్టు ఆధారాలు కనిపించలేదు. పైగా ఆ భక్తుడు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు.