వేడెక్కిన ఇందూరు | dharna in front of kcr house for b-form | Sakshi
Sakshi News home page

వేడెక్కిన ఇందూరు

Published Wed, Mar 19 2014 3:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

dharna in front of kcr house for b-form

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు బరిలో దిగిన వారికి ‘బి’ ఫారం దొరక్కపోగా ఆయా పార్టీల నేతల ఇం డ్లు, పార్టీ కార్యాలయాల ఎదుట ధర్నా చేశా రు. తమ నేతకు ఎమ్మెల్యే టికెట్ రావడం లేదం టూ ఓ విద్యార్థి నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు జిల్లాలో చర్చనీయాం శంగా మారాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య న వికటించిన పొత్తులు, బీజేపీ, టీడీపీల మధ్య న చిగురిస్తున్న స్నేహం.. తదితర  పరిణామాలు హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తం మీద ‘ఇం దూరు’ రాజకీయం గరం గరంగా మారింది.

 టీఆర్‌ఎస్‌కు ఇంటిపోరు
 మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టిక్కెట్లు, ‘బి’ఫారముల కేటాయింపులో టీఆర్ ఎస్ వివాదాస్పదంగా మారింది. నగర పాలక సంస్థ కార్పొరేటర్ల స్థానానికి బరిలో దిగిన పలువురు అర్హులైన అభ్యర్థులకు టిక్కెట్లు  ఇవ్వడం లో టీఆర్‌ఎస్ అర్బన్ ఇన్‌చార్జి బస్వ లక్ష్మీనర్స య్య అన్యాయం చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఆయన ఇంటి ముందు బైఠాయిం చి ‘బి’ ఫారములు అమ్ముకున్నారంటూ మట్టెల శేఖర్‌తో పాటు పలువురు నిరసన వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రెండేళ్ల క్రితం భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి బోధన్ నుంచి టిక్కెట్ ఆశించారు. అయితే 2009లో ఓడిపోయిన షకీల్‌నే తిరిగి పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేయడంతో గంగారెడ్డి మంగళవారం మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి  నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన నల్లమడుగు సురేందర్‌కు ఈసారి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. జడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు అధిష్టానం ప్రకటించగా, సురేందర్‌కు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలం టూ లింగంపేట మండలం ఐలాపూర్‌కు చెందిన నీరడి సాయికుమార్ (19) అనే డిగ్రీ విద్యార్థి కామారెడ్డిలో మంగళవారం ఆత్మహత్యాయత్నం చేయడం వివాదస్పదంగా మారింది.
 
 నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు టిక్కెట్ల కేటాయిం పుపై నిరసనలు, అసంతృప్తిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిజామాబాద్‌లోని 50 డివిజన్లలో ‘బి’ఫారముల కేటాయింపులో నిరసనలు ఎగసిపడుతున్నాయి. ఈ సందర్భంగా 12వ డివిజన్ నుంచి నామినేషన్ వేసిన శివచరణ్‌కు ఆశాభంగం కావడంతో మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గం గాధర్ ఇంటివద్ద వాగ్వాదానికి దిగారు.

డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్ హందాన్‌కు వర్గానికి చుక్కెదురు కావడం కూడ పార్టీ వర్గాల్లో దుమారం రేపుతోంది. కాగా కామారెడ్డిలో పార్టీ కోసం శ్రమించే వారికి టిక్కెట్ ఇవ్వలేదంటూ బీజే వైఎం కార్యకర్త మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మాహత్యాయత్నం చేయడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన పలువురు పార్టీలు మారుతుండగా.. బి ఫారము దక్కని కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో దిగడం.. ఆయా పార్టీల నేతల ఇళ్లను ముట్టడించడం తదితర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement