ప్రభుత్వ ప్రకటనతో రైతుల్లో ఆందోళన: డీకే అరుణ
హైదరాబాద్: విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోవడంతో కేవలం మహబూబ్ నగర్ జిల్లాలోనే 26 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. మూడేళ్ల వరకు కరెంట్ కష్టాలు తప్పవన్న ప్రభుత్వ ప్రకటనలతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆమె అన్నారు.
రైతుల్లో భరోసా నింపేందుకు, వారికి అండగా ఉండేందుకు, రైతుల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు ఈనెల 18న మహబూబ్ నగర్ లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బోగస్ కార్టుల పేరుతో రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులను పెద్ద ఎత్తున తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీకే అరుణ ఆరోపించారు.