'కలలో కూడా ఊహించలేదు' | dk aruna slams trs government | Sakshi
Sakshi News home page

'కలలో కూడా ఊహించలేదు'

Published Sat, Mar 7 2015 12:56 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

'కలలో కూడా ఊహించలేదు'

'కలలో కూడా ఊహించలేదు'

హైదరాబాద్: తెలంగాణ ఉభయ సభల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... అధికారపక్షం తీరును తూర్పారబట్టారు. బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం ఎలాంటి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. అందరినీ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు.

సభలో జరిగిన విషయాలను బయటకు చెప్పకుండా, తమకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే విడుదల చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. సభలో జరిగిన విషయాలకు సంబంధించిన దృశ్యాలను బయటకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార మదంతో టీఆర్ఎస్ నాయకులు విపక్ష నాయకులను అణగతొక్కాలని చూస్తున్నారని విమర్శించారు.

ప్రతిపక్షాల గొంతునొక్కిన తీరు ఇకముందు సాగబోదన్నారు. ముఖ్యమంత్రి పూటకో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అణగతొక్కాలన్న వైఖరిని మార్చుకుని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలని ప్రభుత్వానికి ఆమె హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement