
హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టిన వుహాన్‌కు వెళ్లడమంటేనే డేంజర్ జోన్‌లోకి అడుగుపెట్టినట్టుగా అందరూ భావిస్తుంటే ఆ డాక్టర్ అక్కడి బాధితులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవు చైనాలోని వుహాన్‌కు వెళ్లి వైరస్ రోగులకు వైద్య సేవలందించి తన ఔదార్యం చాటుకున్నారు. వాషింగ్టన్ డీసీలో నివసించే తెలుగు వ్యక్తి డాక్టర్ నాగరాజు చైనాలోని వుహాన్‌కు వెళ్లి కరోనా రోగులకు వైద్య సేవలందించారని, ఆయన తన బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన అనంతరం చైనీయులు ఆయనను ప్రత్యేక విమానంలో సాగనంపారని ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ ట్వీట్ చేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలను కాపాడేందుకు నిబ్బరంగా నిలిచే ఇలాంటి వారికి మనం శాల్యూట్ చేయాలని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ నాగరాజు చూపిన చొరవను పలువురు నెటిజన్లు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment