గర్భిణులకు ఎనిమా ఇచ్చి వదిలేసిన డాక్టర్లు !
ఇబ్బందులు పడిన బాధితులు
నర్సంపేట ప్రభుత్వాస్పత్రిలో ఘటన
నర్సంపేట : డెలివరీ కోసం వచ్చిన గర్భిణీలకు వైద్యులు ఎనివూ ఇచ్చి వదిలేయుడంతో వారు ఇబ్బందులుపడిన సంఘటన పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోవువారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన వుద్ది అనూష, గుడికందుల రజిత ఆదివారం రాత్రి ప్రసవం కోసం ఏరియూ ఆస్పత్రి వచ్చారు. పరీక్షించిన వైద్యులు సోవువారం ఉదయుం రావాలని తెలిపారు. దీంతో తెల్లవారుజామున 4 గంటల సవుయూనికి ఆస్పత్రికి చేరుకున్నారు. వారికి ఆపరేషన్లు చేయుడానికి వైద్యులు ఎనివూ ఎక్కించారు. ఇంతలోనే వుత్తు డాక్టర్ కిషన్ పని ఉందంటూ మళ్లీ వస్తానని వెళ్లిపోయూరు. ఆపరేషన్‌కు సిద్ధమైన సదరు గర్భిణీలు వైద్యుడు కిషన్ కోసం ఎదురు చూడసాగారు. అతడు ఎంతకీ రాకపోవడంతో ఎప్పుడు వస్తాడని వారు నిలదీశారు. ఇంతలో విషయుం తెలుసుకున్న నగర పంచాయుతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్ ఆస్పత్రికి వచ్చి ఆస్పత్రిలోని వైద్యులతో వూట్లాడారు.
అలాగే రికార్డులను పరిశీలించడంతో కేవలం డాక్టర్ జగదీశ్వర్ వూత్రమే విధుల్లో ఉండగా మిగతా వైద్యులు ఎవరూ విధుల్లో లేకున్నా సంతకాలు చేసినట్లు ఉంది. దీంతో చైర్మన్ రాంచంద్రయ్యు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయుమై డీఎంఅండ్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేయుడానికి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో కలెక్టర్ వాకాటి కరుణకు ఫోన్ చేసి విషయూన్ని తెలిపారు. ఆస్పత్రికి ఆర్డీఓ రావుకృష్ణారెడ్డి చేరుకుని వైద్యులతో వూట్లాడారు. గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆస్పత్రిలోని వైద్యులకు సూచిం చారు. ఎనివూ ఎక్కించిన వైద్యులను వెంటనే వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి తరలించారు.