కేంద్రాన్ని నిందించడం తగదు
హన్మకొండ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేయకుండానే ప్రతీ అంశానికి కేంద్రప్రభుత్వాన్ని నిందించడం సరికాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హితవు పలికారు. హన్మకొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాట య్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ మినహా రాష్ట్ర మంత్రు లు, ఎంపీలు ఏ ఒక్కరు కూడా ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిసి రాష్ర్టంలో అభివృద్ధి పనులకు సం బంధించి ఎలాంటి ప్రతిపాదనలు సమర్పించలేదని పేర్కొన్నారు. ఇదేక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎంపీలు కేంద్రాన్ని కలిసి అనేక ప్రతిపాదనలు అందజేయాలని తెలిపారు.
అయినప్పటికీ బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలో ఉంచడమే కాకుండా ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని కోరినట్లు ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కలిసి వరంగల్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. గోదావరి నదిలో షిప్పింగ్ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు నౌకాయాన సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఇదేక్రమంలో రైల్వే బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన రెండే రైళ్లు తెలంగాణ మీదుగానే వెళ్లనున్నాయని, కొత్తగా ఎవరిపై భారం పడనందున బడ్జెట్ ఆశాజనంగానే ఉన్నట్లు భావించాలన్నారు. ఇక నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయంతో మెల గాలని సూచించారు. బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి ఎన్.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిని ధిక్కరించినట్లు మాట్లాడడం సీఎం కేసీఆర్‌కు తగదన్నా రు. కాజీపేటకు డివిజన్ హోదా, కోచ్ ఫ్యాక్టరీ వంటివి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
రేపు ల్యాబర్తికి బీజేపీ ఎంపీ చందన్‌మిత్రా
పర్వతగిరి మండలం ల్యాబర్తికి బీజేపీకి చెందిన రాజ స్థాన్ రాజ్యసభ సభ్యుడు చందన్‌మిత్రా శుక్రవారం రానున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలి పారు. ల్యాబర్తిలో చందన్‌మిత్రా ఎంపీ లాడ్స్ నుంచి రూ.15లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారని, దీనిని ఆయన ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కూడా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీరాముల మురళీమనోహర్, కుమారస్వామి, కొత్త దశరథం, వీసం రమణారెడ్డి, ఏదునూరి భవాని, రవళి, భాస్కర్‌పాల్గొన్నారు.