లండన్‌లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరిగే ప్రపంచ విద్యా సదస్సుకు (ఎడ్యుకేషన్ వరల్డ్ సమ్మిట్) హాజరయ్యేందుకు....
సాక్షి, హైదరాబాద్: లండన్‌లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరిగే ప్రపంచ విద్యా సదస్సుకు (ఎడ్యుకేషన్ వరల్డ్ సమ్మిట్) హాజరయ్యేందుకు నేడు (శనివారం) తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పాఠశాల విద్యా డెరైక్టర్ (డీఎస్‌ఈ) చిరంజీవులు లండన్‌కు బయలుదేరి వెళ్తున్నారు. తిరిగి ఈ నెల 23న హైదరాబాద్‌కు రానున్నారు. సదస్సులో పాల్గొనడంతోపాటు అక్కడి విద్యా విధానాలను వారు పరిశీలించనున్నారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ అమలుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో దీన్ని అమలు చేసేందుకు అనుకూలమైన విధానాలపై అధ్యయనం చేయనున్నారు.