మోర్తాడ్: ఎన్నికల సంఘం ప్రకటనతో జంప్‌జిలానీల్లో ‘విప్’ భయం పట్టుకుంది. స్థానిక సంస్థల సభ్యులు పార్టీల గుర్తులపై ఎన్నిక కావడంతో వారు పరోక్ష ఎన్నికల్లో పార్టీల నాయకత్వం నిర్ణయం ప్రకారమే ఓటు వేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సభ్యత్వం ర ద్దు అవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిం చిం ది. దీంతో జంప్‌జిలానీలను ‘విప్’ కలవరపెడుతోం ది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడిన 50 రోజుల తర్వాత మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ చైర్మన్‌ల ఎన్నికలు జరుగనున్నాయి. గురు, శుక్ర, శనివారాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వనుంది.
ఇప్పటికే క్యాంపుల్లో
జిల్లా పరిషత్, మున్సిపల్‌ల కంటే మండల పరిషత్‌లలోనే జంప్‌జిలానీలు ఎక్కువగా ఉన్నారు. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు ఏ పార్టీకి వస్తే ఇతర పార్టీల ఎంపీటీసీ సభ్యులు మెజార్టీ ఎంపీటీసీల క్యాంపులకు వెళ్లారు. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నెలకొంది. అనేక చోట్ల టీఆర్‌ఎస్ శిబిరాల్లో కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కొన్ని శిబిరాల్లో టీఆర్‌ఎస్ ఎంపీటీసీలు ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆ పార్టీ తరపున నెగ్గిన చాలామంది ఎంపీటీసీలు కాంగ్రెస్ క్యాంపుల నుంచి తిరిగి వచ్చారు. కొందరు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు కూడా టీఆర్‌ఎస్ క్యాంపుల్లో ఉన్నారు.
సభ్యత్వమే రద్దు
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే విప్ జారీ చేస్తామని ఆయా పార్టీల నాయకత్వం హెచ్చరించినా వీరు పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విప్‌లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సారి మాత్రం పార్టీ గుర్తుపై గెలిచిన సభ్యులు ఆయా పార్టీల విప్‌కు అనుగుణంగానే ఓటు వేయాలని స్పష్టంచేసింది. లేకుంటే సభ్యత్వం రద్దు అవుతుందని ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి నోటిఫికేషన్‌లోనే స్పష్టం చేశారు.
దీంతో పార్టీ విప్‌కు ప్రాధాన్యత పెరిగింది. పార్టీ ఆదేశాలను పాటించని నాయకులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎంతో శ్రమించి గెలుపొందిన తాము పార్టీ విప్‌ను ధిక్కరిస్తే వేటు పడుతుందని ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి దాదాపు ఇన్నిరోజుల పాటు క్యాంపులను నిర్వహించినా ‘విప్’ దెబ్బకు వృథా అయిపోయిందని వాపోతున్నారు. ఈసారి విప్ జారీ వల్ల చాలా మండలాల్లో చైర్మన్, వైఎస్‌చైర్మన్ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జంప్‌జిలానీల్లో ‘విప్’ భయం
Published Wed, Jul 2 2014 5:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement