హసన్‌పర్తి : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల విద్యుత్ బకారుులను మాఫీ చేసిందని డీఈఈ సామ్యానాయక్ అన్నారు. విద్యుత్ వారోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ రూరల్ సబ్ డివిజన్ (హసన్‌పర్తి, ఆత్మకూరు, గీసుకొండ, హన్మకొండ) మండలాలకు చెందిన ఏఈఈ, లైన్ ఇన్‌స్పెక్టర్, లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్‌లకు శనివారం మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్యానాయక్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన పాత విద్యుత్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.
ఎస్టీల బకాయిలు విడుదల కాలేదని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు విద్యుత్ చౌర్యానికి పాల్పడొద్దని, విద్యుత్ మీటర్లు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ప్రతి నెలా 50 యూ నిట్ల విద్యుత్ వినియోగించినట్లయితే సబ్‌ప్లాన్ కింద ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపా రు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.725 చెల్లిస్తే అక్కడికక్కడే మీటర్ బిగించే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారికి రూ.2 నుంచి రూ.3వేల వర కు జరిమానా విధిస్తామన్నారు. జిల్లా వ్యాప్తం గా గ్రామ పంచాయతీలకు సంబంధించిన వి ద్యుత్ బకాయిలు విడుదలయ్యాయని డీఈఈ తెలిపారు. ఆయా ప్రాంతాలకు చెందిన ట్రాన్‌సకో సిబ్బం ది కార్యదర్శుల వద్దకు వెళ్లి బిల్లులు వసూలు చేయాలని సూచించారు.
లోకల్ ఎర్త్, హెల్మెట్ల పంపిణీ..
ప్రతి సబ్‌స్టేషన్‌కు లోకల్‌ఎర్త్, హెల్మెట్లను డీఈఈ సామ్యానాయక్ అందించారు. విద్యు త్ సిబ్బంది విధి నిర్వహణలో లోకల్ ఎర్త్‌ను తప్పకుండా దగ్గర ఉంచుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో ఏఈ సాంబారెడ్డి, ఏఈలు వాలునాయక్, జవహర్‌నాయక్, సత్యనారాయణ, పవన్‌కుమార్, కిశోర్, వివి ధ సబ్‌స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
రూ.3 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ
Published Sun, May 3 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM
Advertisement