ప్రతీకాత్మక చిత్రం
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగులకు ఉచిత నైపు ణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడం జరుగుతు ందని, ఈ శిక్షణ పొందేందుకు సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన యువతీ, యువకులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు సత్యనారాయణశర్మ ఓ ప్రకటనలో తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌ష్ట్రక్షన్ హైదరాబాద్‌కు చెందిన వారు హైదరాబాద్ కేంద్రంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
మూడు నెలల పాటు ఇచ్చే ఈ శిక్షణలో అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తులను సంక్షేమ భవనంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందించాలన్నారు. వివరాలకు 85007 27916ను సంప్రదించాలన్నారు.
జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో..
ఖమ్మంస్పోర్ట్స్: ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద ప్రముఖ శిక్షణ కేంద్రాల్లో ఆయా కోర్సుల్లో ఈ నెల 17న నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో ఆసక్తి కలిగిన నిరుద్యోగులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. డోమాస్ట్రిక్ డేటా ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ అసోసియేటెడ్ , వెబ్ డెవలపర్స్, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ టైలర్, డేటాబేస్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులు కనీసం అయిదో తరగతి నుంచి ఐటీఐ డిప్లామా, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ కోర్సులు పూర్తి చేసి ఉండాలన్నారు. ఈ నెల 17న ఉద యం 8గంటలకు జరిగే మేళాకు హాజరు కావాలన్నారు. శిక్షణ సమయంలో రవాణ భత్యం కింద రూ. వెయ్యి, శిక్షణ పూర్తి చేసిన యువకులకు నెల పాటు ఉచితంగా రూ.1500 చొప్పున చెల్లిస్తారన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్టిఫికెట్‌ను శిక్షణ పొందిన వారికి అందజేస్తామన్నారు. అంతేగాక ప్రధానమంతి కౌశల్ యోజన కింద రుణాలు అందిస్తామని తెలిపారు. వివరాలకు 79979 73329 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment