సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: టేకులపల్లి మండలంలోని సిద్దారం అడవుల్లో గురువారం తెల్లవారు జామున పోలీసులకు న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం రామన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాగా ఇద్దరు దళ సభ్యులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎదురు కాల్పుల్లో ఎవరూ మృతి చెందలేదని కొత‍్తగూడెం ఎస్‌పీ కార్యాలయం వివరణ ఇచ్చింది. పోలీసులు గాలింపు చర‍్యలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.