చేసి చూపిస్తాం, లేకుంటే రాజకీయ సన్యాసం | errabelli dayakara rao challenges to TRS government | Sakshi
Sakshi News home page

చేసి చూపిస్తాం, లేకుంటే రాజకీయ సన్యాసం

Published Sat, Oct 11 2014 10:47 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

చేసి చూపిస్తాం, లేకుంటే రాజకీయ సన్యాసం - Sakshi

చేసి చూపిస్తాం, లేకుంటే రాజకీయ సన్యాసం

వరంగల్ : టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించడం చేత కాకపోతే విద్యుత్ శాఖను  నెలరోజులు పాటు టీడీపీకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము వ్యవసాయానికి 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, అలా ఇవ్వలేకపోతే రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధమని ఎర్రబెల్లి చాలెంజ్ చేశారు.

దీనిపై చర్చకు టీఆర్ఎస్ సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. అందుకు టీఆర్ఎస్ నేతలే చర్చా వేదిక, సమయం చెప్పాలన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఎర్రబెల్లి ఆరోపించారు. రైతుల సమస్యలు, విద్యుత్ కొరతపై తెలంగాణ టీడీపీ నేతలు బస్సుయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement