సాక్షి, హైదరాబాద్ : ఇప్పటి వరకు తెలంగాణలో విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్ ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, చికిత్సపై ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడంతో వారందరినీ క్వారంటైన్‌లో ఉంచేందుకు కావాల్సిన ఏర్పాట్లపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా క్వారంటైన్ సెంటర్స్‌లో అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను కోరారు. (అక్కడ మాకు స్క్రీనింగ్ చేయలేదు: హీరోయిన్)
ఆసుపత్రికి ఎంత మంది పేషెంట్లు వచ్చినా చికిత్స అందిచేందుకు కావాల్సిన ప్రణాళిక సిద్దంగా ఉంచాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నవారికి కరోనా సోకకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ చర్య కొనసాగించాలంటే విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి,హెల్త్, పోలీస్, పంచాయితీ రాజ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఆ టోర్ని నిర్వాహకులపై సైనా ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment