బీసీలంటే ప్రాణం
• మాజీ ఎంపీ విఠల్‌రావు ఇక లేరు..
• అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
• వివిధ పార్టీల నాయకుల సంతాపం..
• స్వగ్రామమైన లగచర్లలో విషాదఛాయలు
మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావు(69) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
కొడంగల్ : మాజీ ఎంపీ విఠల్ రావుకు బీసీలంటే ప్రాణం. శనివారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారని తెలియడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వస్థలం బొంరాస్‌పేట మండలం లగచర్ల గ్రామం. దేశ రాజకీయాల్లో బీసీ నేతగా పేరు పొందారు. నియోజకవర్గంలో ఎంతోమంది బీసీలకు రాజకీయ భవిష్యత్ కల్పించారు. 2004లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచారు. 2009లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కొడంగల్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరీక్షలు చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణంరాజు సంతాపం ప్రకటించారు.
విఠల్‌రావు మృతి జీర్ణించుకోలేనిది...
మహబూబ్‌నగర్ అర్బన్ : మాజీ ఎంపీ డి.విఠల్‌రావు ఆకస్మిర మృతి జిల్లాకు తీరనిలోటని, ఆయన లేడన్న వా స్తవాన్ని జీర్ణించుకోలేమని పలు వురు నాయకులు సంతాపం ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి, ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగ దీశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, కాంగ్రెస్ నాయకులు రంగారావు, శ్రీనివాసాచారి, బుర్రి వెంకట్ రాంరెడ్డి, సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, పటేల్ వెంకటేశ్, అంజయ్య, లక్ష్మీకాంత్, అల్తాఫ్ హుసేన్, హనీఫ్, మాజీ కౌన్సిలర్ బెనహర్ తదితరులు ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
’పేట’లో..
నారాయణపేట : మాజీ ఎంపీ డి.విఠల్‌రావు మృతి పట్ల ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ శశికళ, వివిధ పార్టీల నాయకులు కేశవర్దన్‌రెడ్డి, గందెరవి, సరఫ్‌రాజ్ ప్రధాన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి, అభిమానులకు తీరని లోటని మార్కెట్ మాజీ చైర్మన్ సుధాకర్, మాజీ ఏజీపీ అబ్ధుల్ సలీం సంతాపం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
జడ్చర్ల : మాజీ ఎంపి విఠల్‌రావు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మాజీ ఎంపీ మల్లురవి అన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు.
లగచర్లలో విషాదఛాయలు
బొంరాస్‌పేట : మాజీ ఎంపీ విఠల్‌రావు ఆకస్మికం మృతి ఆయన స్వగ్రామం లగచర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండలకేంద్రంతో పాటు నాందార్‌పూర్, లగచర్ల, పోలెపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. రేగడిమైలారంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిం చారు. కార్యక్రమాల్లో నాయకులు వెంకటస్వామి గౌడ్, గోవర్ధన్, గోవింద్‌రెడ్డి, బలిజ శేఖర్, విశ్వనాథం, కృష్ణయ్య, శివకేశవ యువజన సం ఘం, బీఎస్ప నాయకులు వెంకటయ్య, శేఖర్, సాయకుమార్ తదితరులు ఉన్నారు.