నాసిక్‌లోని ఓ ఇండస్ట్రీలో వైన్ తయారీ వివరాలను తెలుసుకుంటున్న దేవీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైన్ పరిశ్రమను నెలకొల్పడానికి తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది. తద్వారా ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు, యువతకు ఉపాధి కల్పించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్ మహారాష్ట్ర నాసిక్‌లో ఓ జాతీయ స్థాయి వైన్ పరిశ్రమను సందర్శించి, పలు అంశాలను అధ్యయనం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకు 50 వేల కేసుల వైన్ వినియోగిస్తున్నారు. ఇక్కడ వైన్ పరిశ్రమ లేక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో వైన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే.. నగరం చుట్టూ ఉన్న మేడ్చల్, యాదాద్రి, శంషాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలకు చెందిన రైతాంగాన్ని కొంత మేరకు పత్తి సాగు నుంచి తప్పించి ద్రాక్ష తోటల పెంపకం వైపు మళ్లించవచ్చని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment