ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం పలుగుల గ్రామం వద్ద పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం పలుగుల గ్రామం వద్ద పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలంలో 158 డిటోనేటర్లు, 25 జిలెటిన్ స్టిక్స్, 51 బండిళ్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.