నకిలీ కరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠా అరెస్ట్ | Fake Currency gang arrested | Sakshi

నకిలీ కరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠా అరెస్ట్

Jul 13 2015 4:39 PM | Updated on Sep 4 2018 5:16 PM

రూ.500ల నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్ ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ వద్ద ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేశారు.

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : రూ.500ల నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్ ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ వద్ద ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.54 లక్షల విలువైన రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోవింద్ కుమార్(21) నకిలీ కరెన్సీ నోట్లను పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి నగరానికి తీసుకొచ్చి.. ఇక్కడ నలుగురు వ్యక్తులతో మార్పిడి చేయిస్తున్నాడు. ఒక్క రూ.500 నోటును మార్చినందుకుగాను వారికి రూ.100లు కమీషన్‌గా చెల్లిస్తున్నాడు.

ఇదే క్రమంలో ఆదివారం ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ వద్ద గోవింద్‌కుమార్‌తోపాటు నకిలీ కరెన్సీ చెలామణిలో ఉన్న నామ్‌దేవ్ (మహారాష్ట్ర), దినేష్ (కిషన్‌బాగ్, హైదరాబాద్), మరో బాలుడ్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు సోమవారం మీడియాకు తెలిపారు. వారి నుంచి రూ.1.54 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను, రూ.38వేలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement