ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కుంతాల మండలం గొల్లమాడలో అప్పుల బాధ తాళలేక ఇగ్గిలేడి భోజన్న(40) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం రాత్రి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో వెళ్లిన భోజన్నను కుటుంబసభ్యులు నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు.
వివరాలు..ఇటీవల భోజన్న తన పొలంలో 4 బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. మూడు సంవత్సరాల క్రితం గల్ఫ్ వెళ్లి అక్కడ ఉపాధి దొరక్క అప్పులపాలయ్యాడు. వర్షాలు పడకపోవడం, చేసిన అప్పులు తీర్చే దారి కనపడక తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.