9,10 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటన | Farmer suicides: Rahul Gandhi to visit Telangana in may 9th,10th | Sakshi
Sakshi News home page

9,10 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటన

Published Wed, Apr 29 2015 10:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

9,10 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటన - Sakshi

9,10 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటన

హైదరాబాద్ :  తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన తేదీలు  ఖరారయ్యాయి. వచ్చే నెల 9,10 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు.  పంటలు నష్టపోయిన రైతులను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లేదా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సెగ్మెంట్ నుంచి ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉంది.

రాహుల్ పర్యటన షెడ్యూల్ కోసం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి నేడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రైతుల ఆత్మహత్యలు, వడగళ్లతో ఎక్కువ నష్టం జరిగిన ప్రాంతాల్లో రాహుల్‌గాంధీ సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కాగా రాహుల్  ప్రస్తుతం పంజాబ్లో పర్యటిస్తున్నారు. రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement