'రైల్వే లైనుకు సహకరించండి' | farmers meet adilabad district collector | Sakshi
Sakshi News home page

'రైల్వే లైనుకు సహకరించండి'

Published Wed, Jan 20 2016 1:42 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

farmers meet adilabad district collector

జైపూర్: రైలుమార్గం ఏర్పాటుకు సహకరించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ ను రైతులు కోరారు. జిల్లాలోని జైపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన బుధవారం రైతులతో సమావేశమయ్యారు. రైతులకు సక్రమంగా పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. జైపూర్‌లో జెన్‌కో విద్యుత్ ప్లాంటు నిర్మిస్తోంది. ఈ ప్లాంటుకు మంచిర్యాల సమీపంలోని గనుల నుంచి బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. దీనికి గాను రైలు మార్గం నిర్మాణానికి రైతుల నుంచి భూములు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం బాధిత రైతులతో సమావేశమయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement