
ఆక్రమణల తొలగింపులో రగడ
నిర్మల్ అర్బన్/నిర్మల్ రూరల్ : పట్టణంలో ఆక్రమణల తొలగింపు ఆందోళనకు దారితీసింది. ఆక్రమణలను తొలగిస్తున్న మునిసిపల్ అధికారులను దుకాణదారులు అడ్డుకున్నారు. ముం దస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న టేలాలను శుక్రవారం తొలగించడం ప్రారంభించారు. అయి తే, రెండు టేలాలను తొలగించగా సంబంధిత దుకాణదారులు అందోళనకు దిగారు. తమకు ముందస్తుగా సమాచారమివ్వకుండా ఎలా తొలగిస్తారని మునిసిపల్ కమిషనర్ గంగారాంతో వాగ్వాదానికి దిగారు.
అంతేకాకుండా ఎన్నోచోట్ల ఆక్రమణలు ఉన్నా తమ దుకాణాలనే తొలగించడం అన్యాయమన్నారు. మునిసిపల్ వైస్‌చైర్మన్ అజీంబిన్ యాహియా, కౌన్సిలర్లు చేరుకోవడం, స్థానికులు, దుకాణదారులు గుమిగూడటంతో సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సైలు సునీల్‌కుమార్, మల్లేశ్ వచ్చి స్థానికులకు పంపించారు. అనంతరం దుకాణదారులు కమిషనర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగగా, పోలీసులు చేరుకుని వారిని పంపించివేశారు.