మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం చిలకలమర్రి కాటన్ మిల్లులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై... అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
కాటన్మిల్లులో అగ్నిప్రమాదం
Published Thu, Nov 26 2015 11:25 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement