
మూతపడ్డ ఎరువుల కర్మాగారంలో చెలరేగిన మంటలు
గోదావరిఖని : కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలంలోని రామగుండం ఎఫ్‌సీఐ ఎరువుల కర్మాగారంలో గురువారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మంట పెట్టారా? లేక ఉష్ణోగ్రత పెరిగి మంటలేమైనా చెలరేగాయా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ కర్మాగారాన్ని కొన్ని రోజుల క్రితమే మూసివేశారు. అయితే ఎరువులకు సంబంధించిన కొంత ముడిసరుకు అందులోనే ఉంది. మంటలను అదుపుచేయడానికి దగ్గర్లోని ఫైరింజన్లను సంఘటనాస్థలానికి రప్పించారు అధికారులు . మంటలను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.