![Fire broke out at Uppal Vegetable Market - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/11/vegetable-market_1.jpg.webp?itok=D28_gpyg)
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని వెజిటెబుల్ మార్కెట్ లో శుక్రవారం అర్ధ రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. యాదాద్రి, మేడ్చల్ జిల్లాల రైతులు చాలా మంది ఇక్కడకు కూరగాయలు తీసుకొచ్చి విక్రయం చేస్తుంటారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మార్కెట్ లో మంటలు అలుముకున్నాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో ఐదు కూరగాయల షాపులు దగ్ధమయ్యాయి.
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఎలా చెలరేగాయి అనే సంగతి తెలియలేదు. ఎవరైనా కావాలని చేశారా ? లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రమాదాని గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment