ఉప్పల్ ఎస్బీహెచ్లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: ఉప్పల్ ఎస్బీహెచ్లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది, స్థానికులు వెంటనే అప్రమత్తమై... అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, బ్యాంకు అధికారులు ఎస్బీహెచ్ వద్దకు చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.