వరంగల్ లీగల్ : ఎండు గంజాయి రవాణా చేస్తున్న నేరం రుజువు కావడంతో మరిపెడ బంగ్లా గన్యాతండకు చెందిన గుగులోతు రమాదేవికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మొద టి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.బి.నర్సింహులు బుధవారం తీర్పు ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. 2008, మార్చి1న అప్పటి భూపాలపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ జె.వెంకటేశ్వర్‌రెడ్డి తన సిబ్బందితో ఆజాంనగర్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఉదయం 7 గంటల సమయంలో చేతిలో బ్యాగు, సూట్ కేసు కలిగి ఉన్న మహిళ, పురుషుడు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే పోలీసులు వారిని పట్టుకొని తనిఖీ చేయగా బ్యాగు, సూట్ కేసులో ఎండు గంజాయి ఉంది.
వెంటనే తహసీల్దార్ పంచుల సమక్షంలో విచారించగా.. గుగులోతు రమాదేవి, బానోతు సంతోష్ ఇద్దరు గన్యాతండాకు చెందిన వారిగా ఒప్పుకున్నారు. తమ గ్రామానికి చెందిన, బంధువు అయిన గుగులోతు వెంకన్న ఆదేశాల మేరకు అక్రమ సంపాదన కోసం ఎండు గంజాయి రవాణా చేస్తున్నామని, భూపాలపల్లి మండలం పంబాపూర్ తదితర గ్రామాల్లో 2008, ఫిబ్రవరి 28న 20 కిలోల ఎండు గంజాయి కొనుగోలు చేసి బ్యాగు, సూట్ కేసులో 10 కిలోల చొప్పున పెట్టారు. గుగులోతు వెంకన్న చెప్పిన విధంగా మరిపెడ బంగ్లాకు ఎండు గంజాయి తరలిస్తుండగా భూపాలపల్లిలో గల ఆజంనగర్ బస్టాం డ్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుం డగా పట్టుబడ్డామని ఒప్పుకున్నారు.
ఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ఎండు గంజాయి రవాణా చేస్తున్న నేరం రుజువు కావడంతో నేరస్తురాలు గుగులోతు రమాదేవికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధి స్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఇతర నేరస్తులపై కేసు విచారణ కొనసాగుతోంది. కేసును అప్పటి సీఐ ఎ.సుభాష్‌చంద్రబోస్ పరి శోధించగా.. లైజన్ ఆఫీసర్ రఘుపతి రెడ్డి విచారణను పర్యవేక్షించారు. సాక్షులను హెడ్ కాని స్టేబుల్ డి.వేణుగోపా ల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. ప్రాసిక్యూషన్ తరపున పీపీ సర్దార్ వాదించారు.
గంజాయి రవాణా చేస్తున్న మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష
Published Thu, Apr 9 2015 2:26 AM | Last Updated on Tue, Oct 9 2018 2:23 PM
Advertisement
Advertisement