ఆహారభద్రత దరఖాస్తుల్లో కొన్ని డూప్లికేట్లు ఉన్నాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అభిప్రాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా : ఆహారభద్రత దరఖాస్తుల్లో కొన్ని డూప్లికేట్లు ఉన్నాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అభిప్రాయపడ్డారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలన పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ ఇటీవల సరూర్‌నగర్, బాలానగర్, ఉప్పల్ మండలాల్లో ఏకంగా 96వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఈనెల 15లోగా దరఖాస్తులన్నీ పరిశీలించి డాటా ఎంట్రీ పూర్తిచేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు.