
తుప్రాన్: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఆమె హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ తుప్రాన్ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జయింది. అయితే, ప్రమాద సమయంలో ఎమ్మెల్యే అందులో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. కాగా, నిజామాబాద్ చేరుకున్న కవిత శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
(చదవండి: డ్రోన్ కేసు: రేవంత్ రెడ్డికి బెయిల్)
Comments
Please login to add a commentAdd a comment