స్నేహితులే నిందితులు | Friends offenders in Venkatesam died | Sakshi
Sakshi News home page

స్నేహితులే నిందితులు

Published Wed, Aug 6 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

స్నేహితులే నిందితులు

స్నేహితులే నిందితులు

 సూర్యాపేటరూరల్ :జల్సాలకు అలవాటు పడ్డారు.. బైక్, డబ్బు కోసం స్నేహితుడనే కనికరం కూడా లేకుండా కడతేర్చారు. ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియిని మృతదేహం మిస్టరీనీ పోలీ సులు ఛేదించారు. డబ్బు, అవకాశాల కోసం స్నేహితులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మంగళవారం తన కార్యాలయంలో డీఎస్పీ శ్రవణ్‌కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. చౌటప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన తడక వెంకటేషం(27) కరాటే మాస్టర్‌గా వృత్తిని కొనసాగిస్తున్నాడు. కరాటేలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు. వెంకటేషం ప్రేమవివాహం చేసుకున్న కొద్దిరోజులకే భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలో నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన పల్లెబోయిన జానయ్య పరిచయమయ్యాడు.
 
 జాన య్య ఓ విద్యార్థి సంఘంలో పనిచేస్తుండగా పాఠశాలల్లో ఉన్న పరిచయాలతో వెంకటేషంకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కరా టే శిక్షణ ఇప్పించేందుకు అవకాశాలు కల్పి ంచాడు. దీంతో వెంకటేషం నకిరేకల్‌లో గది అద్దెకు తీసుకుని పాఠశాలల్లో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తూ వృత్తినైపుణ్యాలతో ఆర్థికంగా ఎదుగుతున్నాడు. పల్లెబోయిన జాన య్య స్వగ్రామమైన పాలెం గ్రామానికి చెందిన కందుకూరి మురళి, జానయ్యలు స్నేహితులు. మురళి కూడా కరాటేలో బ్లాక్‌బెల్ట్‌లో ప్రావీ ణ్యం సాధించాడు. వెంకటేషంను పల్లెబోయిన జానయ్య తన స్నేహితుడైన మురళికి పరిచ యం చేశాడు. తాను కరాటేలో ప్రావీణ్యం ఉన్నట్లు మురళి పరిచయం చేసుకున్నాడు. కాగా కొద్ది రోజులుగా కరాటే శిక్షణ అవకాశాల కోసం మురళి ప్రయత్నం చేస్తున్నాడు. అయి నా అవకాశాలు దొరకడం లేదు.
 
 మురళీ అక్క సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఓ దుకాణం నడుపుతుండగా వీరు ము గ్గురు తరచూ ఆమె వద్దకు వచ్చి వెళ్తుండే వా రు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో మురళి ఓ గది కిరాయికి తీసుకుని ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నాడు. ఇదే సమయంలో మురళి కన్ను వెంకటేషంపై పడింది. దీంతో మురళి తన స్నేహితుడైన జానయ్యలు ఇద్దరూ కలిసి వెంకటేషంను హత్య చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో గత నెల 11న వెంకటేషం బైక్‌పై కేతేపల్లి మండలం గుడివాడ గ్రామానికి కల్లు కోసం వెంకటేషంతో పాటు మురళి, జానయ్యలు కలిసి వెళ్లారు. అక్కడ మురళి, జానయ్యలు తక్కువగా కల్లు సేవించి వెంకటేషంకు ఎక్కువగా తాపించారు. అదే రోజు రాత్రి సూర్యాపేట పట్టణంలో ముర ళి తీసుకున్న అద్దెగదికి వచ్చారు. మత్తులో ఉన్న వెంకటేషం చేతులు, కాళ్లను తాళ్లతో కట్టివేశారు.
 
 ఆపై పిడిగుద్దులు గుద్దడంతో పాటు తీవ్రంగా కొట్టారు. కేకలు వేస్తున్న వెంకటేషం నోట్లో గుడ్డలు నొక్కారు. చనిపోలేదని నిర్దారించుకున్న వారు వెంకటేషం మెడ చుట్టూ టవల్‌వేసి గట్టిగా బిగించారు. దీంతో వెంకటేషం ప్రాణాలు కోల్పోయాడు.  12న రాత్రి వెంకటేషం మృతదేహాన్ని బైక్‌పై తీసుకవెళ్లి దుప్పట్లో కట్టివేసి రత్నపురం గ్రామ సమీపంలో గల మూసీ ప్రాజెక్ట్‌లో పడవేశారు. అనంతరం అతడి బైక్ తీసుకుని వెంకటేశం గదిలో డబ్బుల కోసం వెతికారు. మూడు సెల్‌ఫోన్‌లు గదిలో లభ్యమయ్యాయి. అందులో  రెండు ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసి తిరుగు ప్రయాణంలో మూసీలో పడవేసి మరో సెల్‌ఫోన్‌ను మురళి అక్క హైమావతికి ఇచ్చారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైమావతిని పోలీసులు ప్రశ్నించగా నిందితుల ఆచూకి లభించింది. పిల్లలమర్రి గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం నిందితుల ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం రిమాం డ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
 
 బ్రోచర్ ద్వారా సమాచారం...

 వెంకటేషం మృతదేహాం మూసీ ప్రాజెక్ట్‌లో వారం రోజుల తరువాత లభ్యమవడంతో గుర్తుపట్టని విధంగా వెంకటేషం మృతదేహాం ఉబ్బిపోయింది. దీంతో మృతదేహం ఫొటోను బ్రోచర్‌లుగా ప్రచురించి ఆర్టీసీ బస్సులకు అతికించడంతో పాటు పలు చోట్ల బ్రోచర్‌లు పంచారు. అచూకి తెలిపిన వారికి పారితోషకం ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాగా నకిరేకల్‌కు చెందిన ఓ వ్యక్తి సూర్యాపేటరూరల్ సీఐ నర్సింహారెడ్డికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. ఈ నిం దితులు గతంలో నాంపల్లి కోర్టులో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు లక్షా ఎనభై వేలకు ఒప్ప ందం చేసుకున్నారు.
 
 అతడిని హత్య చేసేం దుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చి పోలీసులు మురళి, జానయ్యలను పట్టుకుని విచారించడంతో వాస్తవాన్ని ఒప్పుకున్నారు. ఆ కేసులో రెండు నెలలు వీరిద్దరూ జైలు శిక్ష అనుభవించినట్లు తెలిసింది. వీరిద్దరూ క్రిమినల్‌గా ఆలోచిస్తారని అందుకే జల్సాలకు అలవాటు పడి స్నేహితున్నే హతమార్చారని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన సూర్యాపేట రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డిని డీఎస్పీ అభినందించారు. ఇద్దరికి రివార్డు ప్రకటించేందుకు ఎస్పీకి విషయాన్ని తెలిపామన్నారు. సమావేశంలో సూ ర్యాపేట రూరల్‌సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డి, యాదగిరి, శంఖర్ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement