కొత్తపార్టీ పెట్టను: గద్దర్‌ | Gaddar comments about his political party | Sakshi
Sakshi News home page

కొత్తపార్టీ పెట్టను: గద్దర్‌

Published Mon, Aug 14 2017 1:22 AM | Last Updated on Thu, Aug 16 2018 3:23 PM

కొత్తపార్టీ పెట్టను: గద్దర్‌ - Sakshi

కొత్తపార్టీ పెట్టను: గద్దర్‌

సంగారెడ్డి క్రైం: తాను కొత్త పార్టీ పెట్టడం లేదని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన టీ–మాస్‌ (తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్య వేదిక) ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక వర్గాలను ప్రజలను, ప్రజా సంఘాలను ఐక్యం చేయడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వం కొనసాగుతోందని గద్దర్‌ విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా సామాజిక వర్గాలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని, ప్రశ్నించిన వారి గొంతు నొక్కుతోందని విమర్శించారు. రాజ్యాధికారం కోసం దళితులు పోరాటం చేస్తుంటే వారిపై దాడులు చేస్తోందని దుయ్యబట్టారు. నాడు ప్రత్యేక తెలం గాణను వ్యతిరేకించిన వారు ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. టీ–మాస్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రభుత్వంపై తిరగబడటమే కాకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయమని గద్దర్‌ హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement