![GHMC Decoration LED Light For Traffic Signals Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/3/traffic-signal.jpg.webp?itok=GlfqntWM)
బంజారాహిల్స్: రహదారులకు, కూడళ్లకు కొత్తందాలు తీసుకొచ్చే క్రమంలో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు పలు రహదారులు, జంక్షన్లలో స్ట్రీట్ లైట్స్ స్తంభాలకు లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి ప్రయోగాత్మకంగా సెక్రటేరియట్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నళ్లకు కూడా ఎరుపు, ఆకుపచ్చ, నారింజ రంగుల్లో లైటింగ్ ఏర్పాటు చేశారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆ స్తంభం మొత్తం రెడ్ లైటింగ్‌తో, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు గ్రీన్ లైటింగ్‌లతో ఇలా సిగ్నల్ మారిన ప్రతిసారీ రంగులు మారుస్తూ వాహనదారులను ఆకట్టుకుంటోంది. దీంతో అదనపు ఆకర్షణ చేకూరింది. దూరంగా ఉన్న వాహనదారులకు కూడా ముందున్న జంక్షన్‌లో సిగ్నల్ పడిందన్న విషయం తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment