
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించేందుకు ఈ నెల 12న గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈ మేరకు గురువారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఇరు రాష్ట్రాలకు లేఖ రాశారు. మొత్తంగా 8 అంశాలను అజెండాలో చేరుస్తూ, వాటిపై చర్చిద్దామని ప్రతిపాదించారు. అజెండాలో తెలంగాణ కోరుతున్న మళ్లింపు జలాల అంశం లేకపోవడం గమనార్హం. డిసెంబర్ రెండో వారంలో భేటీ నిర్వహిస్తామని, అజెండా అంశాలను తమకు పంపాలని బోర్డు కోరింది. ఇందులో తెలంగాణ వర్కింగ్ మాన్యు వల్ అంశాన్ని పక్కనపెట్టి, పట్టిసీమ ద్వారా ఏపీ మళ్లిస్తున్న జలాలపై ఇందులో తేల్చాలని, దీనిపై చర్చించేందుకు ఈ అంశాన్ని అజెండాలో చేర్చాలని కోరింది.
అయితే వర్కింగ్ మాన్యువల్, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, టెలిమెట్రీ అంశాలనే అజెండాలో చేర్చింది. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని, కాళేశ్వరం, సీతారామ, భక్త రామదాస, తుపా కులగూడెం వంటి ప్రాజెక్టులు పాతవేనని, వాటిని రీఇంజనీరింగ్‌లో భాగంగా మార్పులు చేర్పులు చేస్తున్నా మని ఇదివరకే బోర్డు కు తెలిపింది. అయితే ఈ విషయాన్ని బోర్డు సమావేశంలో లిఖిత పూర్వకంగా అందజేయాలని, అలా అయితేనే ఆమోదం తెలుపుతామని గురువారం రాసిన లేఖ లో తెలిపింది. విభజన సమయంలో మంత్రుల బృందానికి సమర్పించిన ప్రాజెక్టుల జాబితా వివరాలను తమకు అందించాలని బోర్డు కోరింది.
Comments
Please login to add a commentAdd a comment