అన్ని కాదు.. కొన్నింట్లోనే ! | Government primary school, English medium | Sakshi
Sakshi News home page

అన్ని కాదు.. కొన్నింట్లోనే !

Published Mon, Apr 11 2016 1:32 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

Government primary school, English medium

మండలానికి ఆరు పీఎస్‌ల్లోనే ఇంగ్లిష్ మీడియం
ఎస్‌ఎంసీ తీర్మానాల లేఖలు ఇవ్వాలని ఆదేశాలు
తప్పు పడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

 

విద్యారణ్యపురి : జిల్లాలో వచ్చే విద్యాసంవత్సరం(2016-2017)లో అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(పీఎస్)ల్లో కాకుండా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లోనే ఒకటవ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. మండలానికి ఆరు చొప్పున పాఠశాలల ఎంపిక చేసి ఆయా పాఠశాలల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనే తీర్మానం లేఖలను అందజేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ మూడురోజుల క్రితం ఎంఈవోలను ఆదేశించారు. మండలానికి ఆరు చొప్పున అంటే జిల్లాలోని 50 మండలాల్లో కలిపి 300 పాఠశాలల్లోనే ఒకటో తరగతి నుంచి అధికారికంగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు.

 
విద్యాశాఖ మంత్రి ప్రకటన..

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇటీవల ప్రకటించారు. దీంతో అన్ని పీఎస్‌ల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతారని భావించారు. కానీ ఆ తర్వాత జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని 2,234 ప్రభుత్వ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల నుంచి 200 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కడియం సూచించినట్లు సమాచారం. ఇక్కడ వచ్చే ఫలితాలతో జిల్లాలోని అన్ని పాఠశాలలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయూలనేది ఆయన భావనగా తెలుస్తోంది. ఈ మేరకు కలెక్టర్‌వాకాటి కరుణ ఆదేశాలతో డీఈఓ పి.రాజీవ్ మూడు రోజులక్రితం హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలో ఎంఈఓల సమావేశం ఏర్పాటుచేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు మండలానికి ఆరు చొప్పున పీఎస్‌లను ఎంపిక చేయూలని సూచించారు. అరుుతే, ఇంత తక్కువ సంఖ్యలో పాఠశాలలను ఎంపిక చేయడం తమకు ఇబ్బందిగా ఉంటుం దని ఎంఈఓలు పేర్కొనగా... తన చేతిలో ఏమీ లేదని డీఈఓ చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు ఈనెల 15వ తేదీలోగా ఆయా పాఠశాలల వివరాలను ఎస్‌ఎంసీల తీర్మానాల కాపీలతో డీఈఓకు అందజేయాల్సి ఉంటుంది.

 
ఇప్పటికే పలు పాఠశాలల్లో..

జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తున్నారు. స్థానికంగా తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా విద్యార్థుల సంఖ్య పెంచుకోగలిగారు. ఇలా జిల్లాలో 459వరకు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉందని అంచనా. తాజా నిర్ణయం ప్రకారం అధికారికంగా మండలానికి ఆరు చొప్పున పీఎస్‌లను ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ఎంపిక చేయూల్సి ఉంటుంది. అరుుతే, ఆరు చొప్పున కాకుండా.. తల్లిదండ్రుల డిమాండ్, ఎన్ని ఎస్‌ఎంసీలు ముందకొస్తే అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుచేయూలనే సూచనలు వస్తున్నారుు. ఇక ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న మంత్రి శ్రీహరి సూచనలతో కలెక్టర్ వాకాటి కరుణ.. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియం బోధనపై శిక్షణ ఇప్పిస్తున్నారు. తొలుత 60మందికి మాస్టర్ ట్రెరుునర్లుగా శిక్షణ ఇప్పించి.. వారితో మరో 1500 మందికి శిక్షణ ఇప్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇంతలో 300 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుండగా.. మిగతా పాఠశాలల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు చర్చగా మారింది.


‘ప్రైవేట్’కు లేని నిబంధనలా?
ప్రభుత్వ విద్యారంగం పరిరక్షించబడాలంటే పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటుచేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారుు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడేళ్లు రాగానే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చేర్పిస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్లు నిండితేనే ప్రవేశానికి అనుమతి ఉంది. తద్వారా విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా.. రేషన్‌లైజేషన్ ద్వారా పాఠశాలలు మూత పడే పరిస్థితి నెలకొంది. అరుునప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, ఇంగ్లిషు మీడియంలో బోధనకు అనుమతించని ప్రభుత్వం... ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం అనుమతిస్తుండడం గమనార్హం.

 
అంతేకాకుండా అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడైనా ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఇన్ని షరతులు విధించకుండా... ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక తరగతులు ప్రవేశపెట్టి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుచేయూలని పలువురు కోరుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement